యూజర్లకు జియో మరో బిగ్ షాక్.. ఆ రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీ తగ్గింపు!

- రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించిన జియో
- గతంలో ఈ డేటా ప్లాన్ల గ
- గా ఫిక్స్ చేసిన టెలికాం సంస్థ
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చింది. రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించింది. ఇటీవల రెండు పాప్యులర్ రీఛార్జి ప్లాన్లు రూ. 189, రూ. 479లను తొలగించిన జియో.. ఇప్పుడు రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల గడువును తగ్గించి, కేవలం ఏడు రోజులుగా ఫిక్స్ చేసింది.
గతంలో ఈ డేటా ప్లాన్ల గడువు బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అప్పటివరకు ఉండేది. ఇకపై రూ. 69తో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ, రూ. 139తో చేస్తే వచ్చే 12 జీబీ డేటా వారం రోజులే వస్తుంది. ఈ మేరకు జియో తన అధికారిక వెబ్సైట్ ద్వారా శుక్రవారం నాటు ప్రకటన విడుదల చేసింది.